ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్న రష్యా దేశానికి టెక్నోదిగ్గజం గూగుల్ షాక్ ఇస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా అమానుషంగా దాడి చేస్తున్నందుకు నిరసనగా రష్యన్ స్టేట్ మీడియా తమ ఫ్లాట్‌ఫాంలలో ఆదాయాన్ని అర్జించకుండా గూగుల్ సంస్థ నిషేధం విధించింది. ఈ మేరకు గూగుల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా దేశం ఉక్రెయిన్‌పై దాడికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను పరిశీలిస్తున్నామన్న గూగుల్..... తదుపరి చర్యలకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఇకపై రష్యా మీడియా ఛానెళ్లు తమ వీడియోల ద్వారా డబ్బు సంపాదించకుండా ఆంక్షలు పెడుతున్నట్టు యూట్యూబ్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే గూగుల్ సైతం నిషేధాజ్ఞలు జారీ చేసింది. అంతకుముందు ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న అమానుష దాడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు. అయితే.. రష్యా పెట్టుబడులతో నడుస్తున్న ఛానెళ్లను తమ సిబ్బంది నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు.