ఎల్లుండి విశాఖకు జగన్.. కీలక కార్యక్రమం..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఎల్లుండి విశాఖ పట్నానికి రాబోతున్నారు. ఎందుకంటే.. నేవల్ డాక్ యార్డులో ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను ఆయన సందర్శించబోతున్నారు. ఈ నౌకను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. నౌకను పరిశీలిస్తారు. దీంతో పాటు జలాంతర్గామి ఐ ఎన్ ఎస్ వేలాను సీఎం జగన్ సందర్శిస్తారు.

మిలన్ 2022 సందర్భంగా నేవీ నిర్వహించనున్న అంతర్జాతీయ సిటీ పరేడ్ కార్యక్రమాన్ని జగన్ వీక్షిస్తారు. ఇందులో పాల్గొనేందుకు జగన్ ఆర్కే బీచ్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి అంతర్జాతీయ సిటీ పరేడ్ ను సీఎం జగన్ వీక్షిస్తారు. సాయంత్రం వేళ పేరెడ్‌ వీక్షించిన తర్వాత రాత్రి ఏడు గంటలకు సీఎం  జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఇటీవల విశాఖలో నౌకాదళం సందడి పెరిగింది. మొన్ననే ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి వచ్చారు. ఇప్పుడు మిలన్ కార్యక్రమం జరగబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: