ఇవాళ వాళ్ల అకౌంట్లో డబ్బులు వేయనున్న జగన్?
మొత్తం 5 లక్షల మంది రైతులకు పైగా లబ్దిదారులకు రూ. 534.77 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఏపీ సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. వీరితో పాటు 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద రూ. 29.51 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఈ రెండు పథకాల కింద మొత్తం రూ. 564.28 కోట్ల నగదును రైతుల ఖాతాలో ఏపీ సీఎం జగన్ ఇవాళ జమ చేయనున్నారు.