మూడు రోజులు విశాఖలోనే జగన్ మకాం.. ఎందుకంటే..?
ప్రధానంగా ఈ జిల్లాల్లో జరిగే స్పందన వర్క్ షాపుల్లో సీఎం జగన్ పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం సీఎం జగన్ ఇవాళ విశాఖ పట్నం చేరుకుంటారు. విశాఖ పట్నంలోనే బస చేస్తూ మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి వస్తుంటారు. ఈనెల 17 న విశాఖ జిల్లా పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.