జగన్‌ రెడ్డీ.. హోదా గల్లంతైనా పట్టింపు లేదా..?

Chakravarthi Kalyan
కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని గల్లంతు చేసినా పట్టింపు లేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని సీపీఐ మండిపడుతోంది. కేంద్రం వేసిన కమిటీ ప్రత్యేక హోదా కోసమేనని, ఇది జగన్మోహన్ రెడ్డి విజయమని నిన్న వైసిపి బాకాలు వూదిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గుర్తు చేశారు. ఆ కమిటీలో ప్రత్యేక హోదా గురించి చర్చించడం లేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టంగా పేర్కొన్నారని.. ఇప్పుడు వైసీపీ మాట మారుస్తోందని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. జీవీఎల్ వ్యాఖ్యలతో కేంద్రం మరోసారి దగాకు సిద్ధమైందని తెలుస్తోందన్నారు రామకృష్ణ.


ప్రత్యేక హోదా అంశం ఎజెండా నుండి తొలగించి మరో సమాచార పత్రం ఇవ్వడం గమనార్హమని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధనకై చిత్తశుద్ధి ప్రదర్శించాలని సీపీఐ రామకృష్ణ కోరారు. కేంద్రం ఏపీకి పదేపదే చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వామపక్ష పార్టీల నిరసన సభలు, సదస్సులు నిర్వహిస్తాయని  సీపీఐ రామకృష్ణ తెలిపారు. ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని సీపీఐ రామకృష్ణ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: