దేశంలో అందుబాటులోకి వచ్చిన మరో టీకా..?
డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించి డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా మరికొన్నిటీకాలకు అనుమతి వచ్చినా అవి ఎక్కువగా లభ్యం కావడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న సమయంలో బూస్టర్ డోస్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు స్పుత్నిక్ లైట్ కూడా బూస్టర్ డోసుకు అందుబాటులోకి రావడంతో కాస్త కొరత తీరనుంది. ఇక బూస్టర్ డోస్ కు మరిన్నిటీకాలు రెడీగా ఉన్నట్టే అన్నమాట.