మహా విషాదం: లతా మంగేష్కర్ కన్నుమూత
వయోభారం కారణంగా ఆమెను కాపాడటం వైద్యులకు కష్టమైంది. మెరుగవుతున్న దశలో మళ్లీ లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. చిన్న వయస్సులోనే గాయనిగా కేరీర్ ప్రారంభించిన లతామంగేష్కర్.. వివిధ భారతీయ భాషల్లో 30వేలకుపైగా పాటలు పాడారు. కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. భారత నైటింగేల్‌గా గుర్తింపు పొందిన లతా మంగేష్కర్.. భారతరత్న సహా అనేక పురస్కారాలు పొందారు. అంతకుముందే పద్మవిభూషణ్, పద్మభూషణ్ అందుకున్నారు. సినీ రంగంలో దాదాసాహెబ్ పాల్కేసహా అనేక సినీ పురస్కారాలు అందుకున్నారు లతా మంగేష్కర్.