చలో విజయవాడ: ఎక్కడిక్కడే అరెస్టులు, అడ్డగింతలు..

Chakravarthi Kalyan
ఇవాళ ఏపీ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు..రోజురోజుకూ ఉద్యమం ఉధృతం చేస్తున్నాయి. ఈనెల 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామన్న నేతలు.. ఆందోళనల బాట పట్టారు. అయితే.. ఇవాళ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని ఉద్యోగులు భావిస్తున్నారు.

వారిని ఎలాగైనా అడ్డుకోవాలని అధికార యంత్రాంగం, పార్టీ చూస్తున్నాయి. జిల్లాల నుంచి విజయవాడు వచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎక్కడిక్కడే అడ్డుకుంటున్నాయి. చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగుల గృహనిర్బంధాలు, అరెస్టులు కొసనాగుతున్నాయి. ఎమ్మిగనూరులో విజయవాడ బయల్దేరిన బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఉపాధ్యాయులను పోలీ స్టేషన్లకు తరలించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులతో  పోలీస్‌ స్టేషన్లు నిండిపోతున్నాయి. కరోనా కారణంగా చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసుకోవాలంటూ  విజయవాడ సీపీ పలు దఫాలు చర్చలు జరిగినా ఫలితం కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: