గుడ్‌ న్యూస్‌.. ఇక ఇంటి వద్దే కరోనా టీకా..?

Chakravarthi Kalyan
కరోనా అంటే ఇప్పుడు ప్రజలకు లెక్కలేకుండా పోయింది. కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ తర్వాత జనం బాగా భయపడిపోయారు. సెకండ్‌ వేవ్‌లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రులు కిటకిటలాడాయి. కొన్ని మందుల కోసం బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆక్సీజన్ సిలిండర్లు దొరక్కు జనం ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎన్నో విషాద ఘటనలు చూడాల్సి వచ్చింది.


అయితే ఇప్పుడు కరోనా అంటే లైట్‌ గా తీసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ అంత సీరియస్ కానప్పటికీ ఇప్పటికే అనేక రోగాలతో బాధపడేవారికి మాత్రం ఇది డేంజరస్ వైరస్‌గానే భావించాలి. అయితే ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఇలా రోగాలతో బాధపడేవారికి ఓ అవకాశం కల్పిస్తోంది. వీరికి  ఇంటివద్దనే కరోనా బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. ఆరోగ్య సమస్యలున్న వారు హెల్ప్‌లైన్ 040-2111 1111 నంబర్‌కు చేస్తే ఇంటి వద్దే టీకా వేసే ఏర్పాటు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: