బాబోయ్.. 94 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా పోటీ..?
మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇప్పటికే పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు 94 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా ప్రకాశ్ సింగ్ బాదల్ దేశంలోనే ఎమ్మెల్యేగా పోటీకి దిగిన అత్యంత వృద్దనేతగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు కేరళ కమ్యూనిస్టు నేత అచ్యుతనందన్ పేరుపై ఉండేది. ఆయన 92 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా పోటీ చేశారు.