గడువు పెంచిన జగన్.. నిరుద్యోగులూ హర్రీ అప్..?
ఈ రెండు కేటగిరీల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసే గడువును ఫిబ్రవరి 6 వరకు ఏపీపీఎస్సీ పెంచింది. ఈ రెండు ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఇప్పటికే ఓసారి దరఖాస్తు గడువు పెంచిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఇవాళ్టితో పూర్తవుతోంది. అయితే.. ఇప్పుడు దరఖాస్తు గడువును మరోసారి పెంచుతూ ఏపీపీఎస్సీ ఆదేశాలు ఇచ్చింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువు పెంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తగిన అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.