సీఈసీ : తెలంగాణ ఓట‌ర్ల తుది జాబితా ప్ర‌క‌ట‌న‌..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా విడుద‌ల చేసింది. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌లో భాగంగా దాఖ‌లు అయిన అప్లికేష‌న్‌ను ప‌రిష్క‌రించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనంత‌రం ఓట‌ర్ల తుది జాబితాను ప్ర‌క‌టించిన‌ది. ఈమేర‌కు తెలంగాణలో మొత్తం ఓట‌ర్లు 3,03,56,894 మంది ఉన్నారు అని తెలిపింది. ఇందులో పురుషు ఓట‌ర్లు 1,52,56,474 ఉండ‌గా.. మ‌హిళా ఓట‌ర్లు.. 1,50,98,685 ఇత‌ర ఓట‌ర్లు 1,735 మంది ఉన్నారు.
ఓట‌ర్ల జాబితాలో 18-19 ఏళ్ల మ‌ధ్య ఓట‌ర్ల సంఖ్య 1,36,496 మంది ఉన్న‌ట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వివ‌రించింది. 2021తో పోల్చితే మొత్తం ఓట‌ర్ల సంఖ్య సుమారు 2 ల‌క్ష‌లు పెరిగినట్టు పేర్కొన్న‌ది. అయితే మొద‌టిసారి ఓటు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారికి ఓట‌రు గుర్తింపు కార్డుల‌ను ఉచితంగా నేరుగా ఇండ్ల‌కు పంపుతాం అని కేంద్ర  ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. మార్పులు, చేర్పులు క‌లిగిన వారు మాత్రం మీసేవా కేంద్రాల్లో త‌దిత‌ర సెంట‌ర్ల‌లో ఓట‌ర్ కార్డుల‌ను తీసుకోవాల‌ని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: