క‌రోనా : న‌వోద‌య స్కూల్‌లో క‌ల‌క‌లం.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
ఉత్త‌రాఖండ్‌లోని ఓ స్కూల్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేకెత్తించింది. తాజాగా అక్క‌డ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగానే పెరుగుతున్న‌ది. క‌రోనా, ఒమిక్రాన్ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొద‌లైంది. నైనిటాల్ జిల్లాలోని సుయ‌ల్‌బ‌రి ద‌గ్గ‌ర ఉన్న గంగార్‌కోట్‌లోని జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యంలో 85 మంది విద్యార్థుల‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్థారించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏక‌కాలంలో ఒకేసారి  85 మంది విద్యార్థుల‌కు కొవిడ్‌-19 సోకిన‌ట్టు గుర్తించ‌డంతో ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్తం అయిన‌ది. ప్ర‌స్తుతం విద్యార్థులంద‌రూ పాఠ‌శాల‌లోనే ఐసోలేట్ అవుతున్నారు.

అయితే తొలుత డిసెంబ‌ర్ 30న ప్రిన్సిపాల్‌తో పాటు విద్యార్థుల‌కు మొత్తం  11 మందికి క‌రోనా సోకిన‌ట్టు తేల‌డంతో.. ఉత్త‌రాఖండ్ ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్తం అయి మిగ‌తా 488 మంది విద్యార్థుల శాంపిళ్ల‌ను సేక‌రించారు. దీంతో క‌రోనా బారిన ప‌డిన వారిని కోలుకున్న త‌రువాత వారి ఇండ్ల‌కు పంపిస్తాం అని విద్యాశాఖ పేర్కొంది. ఆ పాఠ‌శాల‌లోని 70 శాతం విద్యార్థుల్లో జ్వ‌రం, ద‌గ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందుల‌ను ఎదుర్కుంటున్నార‌ని స‌మాచారం.  ఉత్త‌ర‌ఖండ్‌లో ఒమిక్రాన్ కేసుల‌ను సైతం గుర్తించారు. ఇంత‌కు ముందు నాలుగు కేసులు ఉండ‌గా.. తాజాగా మ‌రొక నాలుగు కేసులు వెలుగులోకి రావ‌డంతో ఉత్త‌ర‌ఖండ్‌లో మొత్తం 8 ఒమిక్రాన్ కేసులు సంభ‌వించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: