టిఎస్ : ఈ ఏడాది మొదటి జీవో ఇదే


తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం నూతన  ఆంగ్ల సంవత్సరాది రోజున ఇచ్చిన తొలి ప్రభుత్వ ఉత్తర్వు ఏమిటో తెలుసా ? ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  జనవరి ఒకటవ తేదీనే ఉత్తర్వులు జారీ చేశారు. అందలో ఏమని ఉందంటే ?
తెలంగాణలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరడం, అందులో పన్నెండు కేసులు కొత్తవి కావడంతో  ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. కోవిడ్-19 నూతన వేరియంట్ తో పాటు అన్నివేరియంట్ లకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిచింది. ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు సూచన మేరకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ  నుంచి నివేదిక తెప్పించుకున్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల స్థానంలో మరలా తదుపరి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని అనుసరించి మరో పది రోజులు రాష్ట్రంలో ఆంక్షలు విధించారు. సభలు, సమావేశాల పై ఆంక్షలు కొనసాగుతాయి.  మత, సాంస్కృతిక కార్యక్రమాల పై నిషేధం కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: