బ్రేకింగ్ : తిరుమలలో శ్రీ లంక ప్రధాని


శ్రీలంక ప్రధాన మంత్రి రాజ్ పక్సే గురువారం మధ్యాహ్నం కుటుంబంతో సహ తిరుమలకు చేరుకున్నాురు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం సహ కార్యనిర్వాహణ అధికారి దర్మారెడ్డి స్వాగతం పలికారు.  శ్రీలంక ప్రధాని పర్యటనపై టిటిడి అధికారులు ముందస్తు గా|ఎవరికీ తెలియపరచలేదు. ఎవరైనా  వివిఐపిలు శ్రీనివాసు ప్రభువును దర్శించుకుంటుంటే టిటిడి  ముందుగా మీడియాకు సమాచారం ఇస్తుంది.   అయితే రాజ్ పక్సే పర్యటన వివరాలు పూర్తి స్థాయిలో టిటికి కూడా తెలియక పోవడంతో మీడియాకు సమాచారం అందలేదు. టిటిడి వసతి గృహంలో శ్రీలంక ప్రధాన మంత్రిని ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీలంక ప్రధాన మంత్రి రెండు రోజులు తిరుమలలో బస చేయనన్నట్లు తెలిసింది. రాజ్ పక్సే తిరుమల శ్రీవారి భక్కుడు. గతంలో ఆయన చాలా మార్లు తిరుమలను దర్శించుకున్నారు.  గతంలో ఆయన తిరుమల వచ్చిన సందర్భంలో తమిళనాడుకు చెందిన తమిళులు చాలా మంది ఆయన పర్యటనను  అడ్డుకునే ప్రయత్నం చేశారు.  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా పర్యటన గోప్యంగా ఉంచినట్లు సమాచారం.రాజ్ పక్సే పర్యటన పూర్తి వివరాలు అందవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: