రాజ్య‌స‌భ‌లో జ‌యాబ‌చ్చ‌న్ ఫైర్‌.. ఎందుకో తెలుసా..?

N ANJANEYULU
పనామా కేసులు వ్య‌వ‌హారం రోజుకొక కొత్త మ‌లుపు తిరుగుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌కు ఈడీ సోమ‌వారం స‌మ‌న్లు జారీ చేసిన‌ది. అయితే ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ భ‌వ‌న్‌లో త‌మ ఎదుట  ఐశ్వ‌ర్య ఇవాళ‌ హాజ‌రు కావాల‌ని ఈడీ ఆదేచింది. ఇప్ప‌టికే ప‌నామా లీక్ కేసులో ఐశ్వ‌ర్య‌రాయ్ పై ఈడీ మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదు అయి ఉంది. మ‌నిలాండ‌రింగ్ కేసులో హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నోరా ఫ‌తేహిలను ఈడీ విచారిస్తున్న‌ది. తాజాగా ఐశ్వ‌ర్య‌రాయ్‌కు ఈడీ నోటీసులు పంపించ‌డంతో తీవ్ర చ‌ర్చ‌కు  బాలీవుడ్‌లో దారి తీస్తోంది.
ప‌లు దేశాల రాజకీయ నాయకులు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల మనీ లాండరింగ్ వ్యవహారాలు పనామా పేపర్స్ లీక్ ద్వారా వెలుగులోకి వచ్చిన విష‌యం విధిత‌మే.  భార‌త్‌లోనూ పనామా లీక్స్ ప్రకంపనలు రేపగా… ఈడీ ఈ మేరకు కేసులు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతూ ఉంది.  పనామా పేపర్స్‌ కేసులో భారత్ నుంచి దాదాపుగా 500 మంది వ‌ర‌కు  ప్రమేయం ఉంద‌ని సమాచారం.  అయితే తాజాగా ఈడీ విచార‌ణ‌కు ఐశ్వ‌ర్య‌రాజ్ హాజ‌రు కాగా.. అటు రాజ్య‌స‌భ‌లో జ‌య‌బ‌చ్చాన్ ఫైర్ అయ్యారు. రాజ్య‌స‌భ‌లో కొంద‌రూ స‌భ్యులు ఐశ్వ‌ర్య విష‌యం తీసుకురావ‌డంపై ఆమె మండిప‌డ్డారు. ముఖ్యంగా మీ ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని.. త‌మ కుటుంబంపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం పై బ‌యాబ‌చ్చ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: