యాదాద్రి క‌లెక్టరేట్ వ‌ద్ద ఏమి జ‌రిగిందంటే..?

N ANJANEYULU
క‌లెక్ట‌రేట్ వ‌ద్ద తండ్రి, కొడుకులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న యాదాద్రి భువ‌నగిరి జిల్లాలో చోటు చేసుకున్న‌ది. అధికారులు త‌మ భూమికి సంబంధించిన పాస్ బుక్ ఇవ్వ‌లేద‌నే.. ఉప్ప‌ల‌య్య‌, అత‌డి కుమారుడు మ‌హేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. అధికారులు అప్ర‌మ‌త్త‌మై  వెంట‌నే వారిని కాపాడారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఆలేరు మండ‌లంలో కొల‌నుపాక లో నివ‌సించే ఉప్ప‌ల‌య్య  త‌న‌కు 4 ఎక‌రాల భూమి ఉన్న‌ద‌ని.. ఆ భూమిని 20 ఏండ్ల కింద కొనుగోలు చేసిన‌ట్టు  తెలిపారు.

అధికారుల‌ను త‌న‌కున్న నాలుగు ఎక‌రాలు ప‌ట్టా పాస్‌పుస్త‌కం ఇవ్వాల‌ని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసారు ఉప్ప‌ల‌య్య‌. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తట్టుకోలేకనే తాము కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు య‌త్నించాము అని వివరించారు. తమకు న్యాయం జరగదనే అనుమానంతోనే తాము ఇలా చేసినట్లు పేర్కొన్నారు ఉప్పలయ్య. ఈ విష‌యం గురించి తమ భూమికి సంబంధించిన  పాస్ బుక్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు రైతు ఉప్ప‌ల‌య్య‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: