సంగారెడ్డిలో కరోనా కలకలం.. ఒకే స్కూల్ లో 46 మంది విద్యార్థినులకు పాజిటివ్..

Purushottham Vinay
ఇక కరోనా మహమ్మారి వెనక్కి తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా ఊపందుకుంది. మళ్ళీ దేశంలో చాలా తీవ్రంగా ఈ మహమ్మారి విజ్రుంభిస్తుంది. ఇక కరోనా కేసులు రోజు రోజుకి చాపకింద నీరు లాగా పెరిగిపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. ఇక చాలా ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.తెలంగాణాలో పరిస్థితి మరీ భయాందోళనగా మారింది. సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తుంది.సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం ఇంద్రేశం లోని  జ్యోతిభా పూలే  బి.సి. వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల(రామచంద్రపురం బ్రాంచ్ )లో కరోనా కలకలం సృష్టించడం జరిగింది.

ఇక మూడవ రోజు  కరోనా టెస్టులను వైద్య సిబ్బంది నిర్వహించడం జరిగింది.విద్యార్థులు ఇంకా అలాగే టీచర్ లకు కలిపి 1000 మంది కి టెస్ట్ లు చేయడం జరిగింది.ఇక టెస్టులో జరుపగా వారిలో మొత్తం 46 మంది బాలికల కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.ఇక అలాగే 9 మంది ని ఆ హాస్టల్ లొనే  ఐసోలెట్ చేసి వారికి వైద్య సిబ్బంది చికిత్సని అందిస్తున్నారు.ఇక పోతే కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఆ మిగతా 37 మంది విద్యార్థులను తల్లి దండ్రులు ఇంటికి తీసుకెళ్లారని వార్త నివేదికల నుంచి సమాచారం అందింది.ఇక వీరు కాక ఆ హాస్టల్ లో ప్రస్తుతం 560 మంది విద్యార్థులున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: