ప్రభుత్వ కార్యాలయంలో మేక.. పరుగులు పెట్టిన ఉద్యోగి

N ANJANEYULU
సాధార‌ణంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో కుక్క‌లు, పిల్లులు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. చౌబే పూర్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యంలోకి మేక ప్ర‌వేశించి మెల్ల‌గా క్యాంటిన్ ప‌క్క‌నే ఉన్న గ‌దికి చేరుకున్న‌ది. గ‌దిలో ఉన్న ప్ర‌భుత్వ ఫైల్ ను నోటితో ప‌ట్టుకున్న‌ది. అనంత‌రం కార్యాల‌యం బ‌య‌ట‌కు ప‌రుగెత్తుకెళ్లింది. మేక నోటిలో ఉన్న‌ ఫైల్‌ను చూసిన ఓ ఉద్యోగి దాని వెనుక ప‌రుగెత్తాడు. అది కీల‌మైన డాక్యుమెంట్ ఫైల్ అని భావించిన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్రాణం పోయినంత ప‌ని అయిన‌ది.
   ఈ త‌రుణంలో మేక చేసిన ప‌నికి కార్యాల‌యంలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయి. మేక వెన‌కాలే ప‌రుగెత్తుంటూ వెళ్లిన ఉద్యోగి చివ‌ర‌కు ఫైల్ డాక్యుమెంట్‌ను  దొర‌క‌బ‌ట్ట‌డంతో అంద‌రూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్ర‌భుత్వ ఫైల్ కాదు అని, సాధార‌ణ ఫైల్ అని తేలిన‌ది. కానీ ఉద్యోగుల నిర్ల‌క్ష్యం మూలంగా ప్ర‌భుత్వ కార్యాల‌యంలోకి మేక ప్ర‌వేశించింద‌ని బ్లాక్ డెవెల‌ఫ్‌మెంట్ ఆఫీస‌ర్  మ‌నులాల్ యాద‌వ్ సీరియస్ అయ్యారు. మేక‌కు సంబందించిన ఈ ఘ‌ట‌న  వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: