కొద్ది సేప‌ట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం..

N ANJANEYULU
భార‌త ప్ర‌ధాని  న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఇవాళ  అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు.  ఈ సమావేశంలో ఆరోగ్య‌శాఖ మంత్రి, కీల‌క అధికారులు హాజ‌రుకానున్నారు.  క‌రోనా కొత్త వేరియంట్ పై వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో దీనిపైనే కీల‌కంగా చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్ర‌పంచ దేశాల‌న్నీ ఇప్ప‌టికే ఓ వైపు ఆందోళ‌న చెందుతున్నాయి. ఈ త‌రుణంలోనే మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది.
నూత‌న  వేరియంట్ లో 32 మ్యూటేష‌న్లు ఉన్న‌ట్టు ఇప్ప‌టికే శాస్త్రవేత్త‌లు సైతం వెల్ల‌డించారు. డెల్టా వేరియంట్ కంటే అత్యంత  ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కావ‌డంతో ప్ర‌పంచ దేశాలు ఇప్ప‌టికే అప్ర‌మ‌త్తం అవుతున్నాయి.  వివిధ  దేశాలు ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు కూడా విధించాయి.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ నూత‌న వేరియంట్ సోకుతుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఇవాళ మోడీ చ‌ర్చించ‌బోనున్నారు. కొత్త వేరియంట్‌తో పాటు దేశంలో కోవిడ్ ప‌రిస్థితి ఏ విధంగా ఉంది.. వ్యాక్సినేష‌న్ ఏవిధంగా న‌డుస్తోంద‌నే విష‌యాల‌ను కూడా చ‌ర్చించనున్నారు ప్ర‌ధాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: