ద‌క్షిణాఫ్రికాను కుదిపేస్తున్న ఒమిక్రాన్‌..!

N ANJANEYULU
క‌రోనా మ‌హ‌మ్మారి కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ కుదిపేస్తూ ఉన్న‌ది. వివిధ రూపాలు విస్తృతం చెందుతూ మ‌రింత బ‌లంగా మార‌డంతో పాటు విరుచుకుప‌డుతున్నది. ఇటీవ‌లే ద‌క్షిణాఫ్రికాలో బీ.1.1.529 వేరియంట్ ను గుర్తించారు. ముఖ్యంగా ఈ వేరియంట్ 32 మ్యూటేష‌న్లుగా ఉంటున్న‌ట్టు క‌నుక్కున్నారు వైద్యులు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్‌గా గుర్తించి దీనికి ఓమిక్రాన్‌గా నామ‌క‌ర‌ణం చేసారు. ద‌క్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, హాంకాంగ్ దేశాల‌లో కూడా క‌నిపించింది.
ఈ ర‌కం వేరియంట్ కేసులు తాజాగా ఇజ్రాయిల్‌, బెల్జియం దేశాల‌లో కూడా బ‌య‌టప‌డ‌డంతో ప్ర‌పంచ దేశాల‌లో ఆందోళ‌న మొద‌లైన‌ది. ముఖ్యంగా ద‌క్షిణాఫ్రికా దేశం నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై  ఇజ్రాయిల్లో ఇప్ప‌టికే నిషేదం విధించారు. అదేవిధంగా జ‌పాన్‌తో పాటు సింగ‌పూర్, యూరోపియ‌న్ దేశాల‌న్ని ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై నిషేదం విధించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశంలో మాత్రం ఒమ్రికాన్ వేరియంట్ కేసులు న‌మోదు కాలేదు అని ఇన్‌కాగ్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: