త్వ‌ర‌లో వైద్య‌రంగంలో పోస్టులు భ‌ర్తీ : సీఎం జ‌గ‌న్

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశంలో ఇవాళ వైద్య రంగం అభివృద్ధి చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు.  వైద్య‌రంగంలో అతిపెద్ద మార్పును వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని తీసుకొచ్చార‌ని గుర్తు చేసారు. ఆరోగ్య‌శ్రీ పెద్ద విప్ల‌వం అని సీఎం స్ప‌ష్టం చేశారు. మ‌నిషి ప్రాణానికి విలువ‌నిచ్చే ప్ర‌బుత్వం ఇది. వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చిత్త‌శుద్దితో ప‌ని చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ వార్షిక ప‌రిమితిని రూ.5ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని స్ప‌ష్టం చేశారు. రూ.10ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యినా కానీ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాం అని చెప్పారు సీఎం.
ఇత‌ర రాష్ట్రాల్లోనూ 130 ఆసుప్ర‌తిల‌లో కూడా ఏపీ ఆరోగ్య శ్రీ సేవ‌లు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. వైద్య రంగంలో దాదాపు 25 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌ని, ఫిబ్ర‌వ‌రిలో 14 వేల వ‌ర‌కు పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, ఏరియా ఆసుప్ర‌తుల‌కు, ప్రాథ‌మిక హెల్త్ సెంట‌ర్ల రూపు రేఖ‌లు మార్చి అప్‌గ్నేడ్ చేసి నాడు నేడు అనే గొప్ప‌కార్య‌క్ర‌మానికి అనుసంధానం చేస్తున్నాం అని చెప్పారు. నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్‌కు త‌గ్గ‌ట్టుగా అప్‌డేట్ చేస్తున్నాం అని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: