రేపు వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం జ‌గ‌న్‌ భేటీ

N ANJANEYULU
పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న త‌రుణంలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు. శుక్ర‌వారం వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీ జ‌రుగ‌నున్న‌ది. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వైసీపీ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌తో సీఎం జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. న‌వంబ‌ర్ 29న పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న త‌రుణంలో జ‌రుగుతున్న ఈ భేటీలో పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తాల్సిన అంశాలు, అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఎంపీల‌కు సీఎం దిశానిర్దేశం చేయ‌నున్నారు.
ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు అనేక ర‌కాలుగా న‌ష్ట‌పోయార‌ని ఈ అంశాన్ని పార్ల‌మెంట్ దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా కేంద్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, విభ‌జ‌న చ‌ట్టంలో అమ‌లుకు నోచుకుని అంశాలు స‌హా వివిధ అంశాల‌తో శీతాకాల స‌మావేశాల‌లో వైసీపీ లేవ‌నెత్తే అవ‌కాశం క‌నిపిస్తోంది. రేపు ఎంపీల‌తో జ‌రుగ‌బోయే సీఎం భేటీలో  ఇవే కాకుండా ఇంకా ఏయే అంశాల గురించి చ‌ర్చించనున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: