తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ కీలక నిర్ణయం..!
తాను ఒక ఎమ్మెల్యే నని, ఎమ్మెల్యే జీతభత్యాలు తనకు సరిపోతాయని చెప్పారు. ఈ విషయం పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు కూడా లేఖ రాసినట్టు వివరించారు. తెలంగాణ ఆర్టీసీ గత మూడేండ్ల కాలం నుండి తీవ్ర నష్టాలలో కొనసాగుతూ ఉంది. నష్టాల నుంచి ఆర్టీసీ సంస్థను గట్టెక్కించేందుకు ఇటీవల ముఖ్య మంత్రి కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కి ఎండీ గా సజ్జనార్, చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపిక చేసారు. అప్పటి నుంచి టీఎస్ ఆర్టీసీ ని లాభాల బాట పట్టించ డానికి అధికారులు ముమ్మరంగా కసరత్తులు చేయడం మొదలు పెట్టారు. ఇటీవల ఎవరైనా పెళ్లికి ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే వారికి బహుమతి కూడా ఇస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.