పోలీస్ వాహనానికి యాక్సిడెంట్.. సీఐ మృతి
సీఐతో పాటు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని.. పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన వాహనం గురించి ఆరా తీస్తున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఘటన చోటు చేసుకున్న సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీఐ ఈశ్వరరావు మృతి దురదృష్టకరమని సీపీ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. పదవీ విరమణకు రెండేళ్లు సమయం ఉన్న తరుణంలో ఈ ప్రమాదం చాలా బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ సంతోష్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం.