ఆ ఎం.పి ఇలా స్పందించారేంటబ్బా ! ?


ఆంధ్ర ప్రదేశ్ సోమవారం హడావిడి అంతా ఇంతా కాదు. అసెంబ్లీలో  జరిగిన చర్చ.. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన..దానిపై వివిధ రాజకీయ పక్షాల వాద ప్రతివాదాలు, మీడియాలో చర్చలు... ఇదీ ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లోని వాడీ వేడి వాతావరణం.  పాత్రికేయ ప్రతినిధులంతా ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు దొరుకుతాడా అని కెమెరా కళ్లతో ఎదురు చూశారు.  ఓ పార్లమెంట్ సభ్యుడు మాత్రం ఎక్కడా ఎవరికీ దొరక లేదు.  మరేం చేశారు.?
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన తుఫాను, ఫలితంగా వచ్చిన వర్షాలు దాని మూలంగా పొంగి పొర్లు తున్న వరద పై గల్లా జయదేవే స్పందించారు. రాష్ట్రానికి ఏర్పడిన  నష్టంపై  ఆయన ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాకు  లేఖ రాశారు. ఆయనే తెలుగుదేశం పార్టీ   పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ .
ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసిన తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ఊహించని తుఫాను కారణంగా రాయలసీమకు చాలా నష్టం జరిగిందన్నారు.  ప్రాణ నష్టం పంట నష్టం జరిగిందని తన లేఖలో పేర్కోన్నారు గల్లా జయదేవ్. రవాణా, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల పై దీని ప్రభావం పడిందని  ఆయన తన లేఖలో ప్రధాన మంత్రి, హోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దెబ్బతిన్న రోడ్డు, రైలు మార్గాలను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని గల్లా జయదేవ్ ప్రధాన మంత్రిని కోరారు.
తుఫాన్ కారణంగా జన జీవనం స్థంభించిన నేపధ్యంలో... ప్రజాప్రతినిధులంతా రాజకీయలు మాట్లూడుతుంటే గల్లా జయదేవ్ మాత్రం అందుకు భిన్నంగా  వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్త ప్రజలను కాపాడాలని ఆయన ప్రధాన మంత్రికి లేఖ రాయడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: