తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం విధానంలో దరఖాస్తుల ప్రక్రియ ద్వారా ప్రభుత్వం ఖజానాకు దాదాపు రూ.1357 కోట్ల ఆదాయం సమకూరినది. నవంబర్ 9 నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం దాదాపు 67,849 దరఖాస్తులు దాఖలాలు అయ్యాయి. ఈసారి 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చాయి.
గతంలో మాదిరిగానే ఈసారి ఖమ్మం జిల్లాలోనే దరఖాస్తులు అత్యధికంగా దాఖలయ్యాయి. మద్యం దుకాణాలకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల వారిగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ల సమక్షంలో డ్రా పద్దతిలో దుకాణదారులను ఎంపిక చేస్తారు. అయితే డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు కూడా పెట్టారు. ముఖ్యంగా ఎస్సీలు, గౌడ్లు, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ క్పలించింది ప్రభుత్వం. రిజర్వేషన్ ప్రకారం స్వీకరించిన దరఖాస్తులను డ్రా పద్దతిలో ఇవాళ కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు.