బిగ్ బ్రేకింగ్: మూడు వ్యవసాయ చట్టాలు రద్దు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తాము వెనక్కి తీసుకుంటున్నట్లు గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాసేపటికి తన అధికారిక ప్రకటన చేశారు. రైతుల ఆందోళనలు అర్థం చేసుకున్న మన ప్రధానమంత్రి మోడీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సరే వెనక్కు తగ్గిన పరిస్థితి లేదు. కానీ అనూహ్యంగా పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి పక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికితోడు త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే మోడీ ఈ అడుగు వేశారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: