ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఒక్క రోజు కాదు ఆరు రోజులు...!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో బిఎసి సమావేశంలో నేడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. ఎయిడెడ్ విద్యాసంస్థలను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల విషయంలో అధికారులు సీరియస్ గా ఉన్నారు.

ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జీవోలు 42, 50, 51, 35 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధి నాయకులు. విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల హై అలర్ట్ ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలతో పాటు అసెంబ్లీకి వెళ్లే రహదారులలో సైతం  మోహరించిన పోలీసుల అదనపు బలగాలు... ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థి సంఘాల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ, మంగళగిరి, రాజధాని గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు... అసెంబ్లీకి వెళ్లే పలు మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: