రేప‌టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

N ANJANEYULU
ఏపీ అసెంబ్లీ స‌మావేశ‌వాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. కీల‌క ఆర్డినెన్స్‌లు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయ‌ని స‌మాచారం. ఈ సంవ‌త్స‌రం జూలై నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు శాఖ‌ల‌కు సంబంధించిన 14 ఆర్డినెన్స్ ను ఆమోదించ‌డానికి అసెంబ్లీకి రానున్నాయి. ఏపీ అగ్రిక‌ల్చ‌ర్ ల్యాండ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ మ‌రియు ప‌ట్టాదార్ పాస్‌బుక్కుల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌, పంచాయ‌తీ రాజ్ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌, ప్ర‌యివేటు వ‌ర్సిటీల చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌, ఏపీ హ‌య్య‌ర్ ఎడ్యూకేష‌న్ రెగ్యులేట‌రీ అండ్ మానిట‌రింగ్ క‌మిష‌న్ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు ఆమోదానికి రానున్న‌ట్టు స‌మాచారం.

అదేవిధంగా ఏపీ విద్యాశాఖ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలీజియ‌స్‌, ఇన్‌స్టిట్యూష‌న్ అండ్ ఎండోమెంట్స్ చ‌ట్ట స‌వ‌ర‌ణ చ‌ట్ట రెండ‌వ స‌వ‌ర‌ణ ఏపీ రెగ్యులేష‌న్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియ‌న్ మేడ్ పారిన్ లిక్క‌ర్‌, ఫారిన్ లిక్క‌ర్ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్సులు కూడా ఆమోదించ‌నున్నారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్‌స‌వ‌ర‌ణ‌, ఏపీ బొవైన్ బ్రీడింగ్‌, సెల్ప్ హెల్ప్ గ్రూపు కో కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్, మున్సిప‌ల్ కార్పొరేష‌న్  చ‌ట్ట స‌వ‌ర‌ణ‌, సినిమా నియంత్ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు అసెంబ్లీలో ఆమోదించ‌నున్నారు. గురువారం ఒక్క రోజే శాసన సభ  నిర్వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  ఏపీ శాస‌న‌ సభ జరిగి ఈనెల 19కి స‌రిగ్గా  ఆరు నెలల సమయం పూర్తవుతుంది. ఆరు నెల‌ల కాలంలో క‌చ్చితంగా  శాస‌న‌స‌భ  స‌మావేశం జ‌ర‌గాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: