ఆసక్తిరేపుతున్న దృశ్యం 2 ట్రైలర్...

Purushottham Vinay
టాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోగా విక్టరీ వెంకటేష్ కి మంచి పేరుంది. అందరి స్టార్ హీరోల్లాగా మాస్ సినిమాలు ఇంకా ఒకే రకమైన కథలని మాత్రమే ఎంచుకోకుండా నటుడిగా పలు విభనమైన పాత్రలు పోషించి వైవిధ్యమైన సినిమాలు చేసి మిగతా అగ్ర హీరోల కంటే కూడా ఎక్కువ హిట్లు అందుకుంటూ విక్టరీ హీరోగా దశ దశాబ్దాలుగా దూసుకుపోతున్నాడు. ఇక విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు వున్నాయి. ఇక అలాంటి వాటిల్లో దృశ్యం సినిమా కూడా చెప్పుకోదగిన సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇక ఆ సినిమా మలయాళ సినిమా దృశ్యంకి అదే పేరుతో తెలుగులో రీమేక్ గా తెరకెక్కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. 


ఇక ఆ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసేశాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన దృశ్యం 2 టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక కొన్ని నిముషాల ముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఇక నారప్ప లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.దృశ్యం 2 సినిమా నవంబర్ 25 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వబోతుంది.



https://youtu.be/uUJtUYkBu-g

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: