సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ బిగ్గెస్ట్ విన్...?
మృతిచెందిన ఉగ్రవాదులు హెచ్ఎం షిరాజ్ మోల్వి & యావర్ భట్ జిల్లా కమాండర్ గా అధికారులు గుర్తించారు. షిరాజ్ 2016 నుండి చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు అమాయక యువకులను తీవ్రవాదులలోకి చేర్చుకోవడం & అనేక పౌర హత్యలలో పాలుపంచుకున్నాడు అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు భారీ విజయం అని ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాము అని సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోంది అని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.