ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్‌లోని 14 ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు నిర్వ‌హించేందుకు స‌న్నాహ‌కాలు  సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నిక‌ల క‌మిష‌న్‌ షెడ్యూల్‌ కూడా జారీ చేసిన‌ది. నామినేషన్ల స్వీకరణ  కూడ ప్రారంభం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం  స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీచేసి నామినేష‌న్ల‌ను కూడ అదేరోజు నుంచి స్వీకరించనున్నారు.

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలకు సిద్ధమైపోతోంది.  ఇవాళ మీడియాతో  వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నిక‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.  ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కడప జిల్లా గోవింద రెడ్డిని య‌ధావిధిగా కొనసాగించనున్నారు. శ్రీకాకుళం జిల్లా  పాలవలస విక్రాంత్ (కాపు),  నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్  అయిన కర్నూలు-ఇషాక్ (మైనారిటీ) అభ్యర్థులుగా ప్రకటించారు స‌జ్జ‌ల‌.   ఈ ఎన్నికలు చాలా రోజుల ముందే జ‌ర‌గాల్సి ఉండాలి. కానీ క‌రోనా కార‌ణంగా   ఆలస్యంగా ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని గుర్తు చేశారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: