అనంతపురంలోని ఎస్ఎస్‌బీఎన్ కళాశాల యాజమాన్యం నిన్న జరిగిన ఘటనపై ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో పీఎల్ఎన్‌రెడ్డి కరస్పాండెంట్, కళాశాల సెక్రెటరీ నిర్మల మాట్లాడారు. ఎస్ఎస్‌బీఎన్ కళాశాల యాజమాన్యం నుంచి ఇప్పటికే 13 మంది అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలలకు వెళ్లిపోయారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రయివేటు సంస్థగా మారినది. ఇంటర్మీడియట్ సైన్స్ కోర్సులకు రూ.5వేలు, ఆర్ట్స్ కోర్సులకు రూ.4వేలు ఫీజు ఉండేదని వెల్లడించారు. అయితే కొత్త నిబంధనల మేరకు సైన్స్‌కు రూ.20వేలు, ఆర్ట్స్‌కు రూ.18వేలు ప్రభుత్వం నిర్ణయించినది. యాజమాన్యం రూ.9వేలు ఫీజులను నిర్ణయించారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం లేదని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే ఎయిడెడ్ లోనే కొనసాగుతామని పేర్కొన్నారు. మరోసారి అధ్యాపకులను వెనక్కి పిలుస్తాం. వారు వస్తే మా కళాశాలకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఇబ్బంది ఎదురవుతుంది. సోమవారం జరిగిన సంఘటనపై ఎస్పీని కలిసి విచారణ కోరుతాం అని పీఎల్ఎన్‌రెడ్డి కరస్పాండెంట్, కళాశాల సెక్రెటరీ నిర్మలలు వివరించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: