తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

N ANJANEYULU
తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైన‌ది. ఇటీవ‌ల హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసిన కొద్ది రోజుల‌కే మ‌ళ్లీ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఇప్ప‌టికే  తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ స్థానాల‌కు షెడ్యూల్ విడుద‌ల అయింది.  అయితే తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నవంబ‌ర్ 16న నోటిఫికేష‌న్ విడుద‌ల అవ్వ‌నుండ‌గా.. డిసెంబ‌ర్ 10న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 14న కౌంటింగ్ ఉంటుంది.

తెలంగాణ‌లో అత్య‌ధికంగా ఎమ్మెల్సీ సీట్లు ఉండ‌డంతో అధికార టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల‌ను కైవ‌సం చేసుకునే అవ‌కాశం కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా క‌డియం శ్రీ‌హ‌రి, సిరికొండ మ‌ధున‌చారి, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, ఎల్‌.ర‌మ‌ణ‌, ఎంసీకోటిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి పేర్ల‌ను ఖ‌రారు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం కేసీఆర్‌. గ‌వ‌ర్న‌ర్ కోటాలో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి పేరును ఫైన‌ల్ చేశార‌ని స‌మాచారం. కానీ దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న అధికారికంగా వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే షెడ్యూల్ రావ‌డంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై అత్యంత త్వ‌ర‌లోనే టీఆర్ఎస్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: