కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.  ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌తో భేటీ కానున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల గురించి ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌కు వివ‌రించ‌నున్నారు మంత్రి బుగ్గ‌న‌.

గ‌త ఆగ‌స్టు నెల‌లోనే అన్‌రాక్ అల్లూమినియం కంపెనీ వివాదంలో ప‌రిష్కారం కోసం, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాకేజింగ్ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డానికి భూ కేటాయింపుల‌పై నిర్మ‌ల సీతారామన్‌తో చ‌ర్చలు జరిపిన విష‌యం విధిత‌మే. ఇవాళ నిర్మ‌ల‌తో భేటీకి ప్ర‌ధాన కార‌ణం ముఖ్యంగా పోలవరం నిధుల గురించి, రాష్ట్రంలో నెల‌కొన్న అప్పుల గురించి చ‌ర్చించే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.  అదేవిధంగా ప‌లు సంస్థ‌ల‌ను ఏపీలో  ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన భూకేటాయింపులపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీలో చ‌ర్చించ‌నున్నారు మంత్రి బుగ్గ‌న‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: