ఎనిమిది మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌

N ANJANEYULU
అమెరికాలో నిర్వ‌హించిన ఓ షోలో తొక్కిస‌లాట జ‌రిగిన‌ది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది. మ్యూజిక్ ఫెస్టివ‌ల్ అంటే ఎంతో హుషారుగా ఉల్లాసంగా కొన‌సాగుతోంది. ఆ  మ్యూజిక్‌ ఫెస్టివల్ మాత్రం విషాదాన్ని మిగిల్చిన‌ది. ఏకంగా ఎనిమిది మంది మృత్య‌వాత ప‌డ్డారు. చాలా మంది గాయాల‌తో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

టెక్సాస్‌లోని హోస్ట‌న్‌లో నిర్వ‌హిస్తున్న మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌లో స్టేజ్ పైకి ట్రావిస్ స్కాట్ రాగానే జ‌నాలు ఒక్క‌సారిగా దూసుకొచ్చారు. అక‌స్మాత్తుగా తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ తొక్కిస‌లాట‌లో 8 మంది అక్క‌డికక్క‌డే మృతి చెందారు. గాయ‌ప‌డిన వారిలో 17 మందిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా  వీరిలో 11 మంది గుండెనొప్పి వ‌చ్చిన‌ట్టుగా డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈవెంట్‌కు దాదాపు 50వేల మంది వ‌ర‌కు మ్యూజిక్ ల‌వ‌ర్స్ హాజ‌ర‌య్యారు. సుమారుగా 300 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డట్టు తెలుస్తున్న‌ది. దీంతో  అధికారులు మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ర‌ద్దు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: