శ్రీకాళహస్తి ఆలయంలో బ్యాగ్ కలకలం..! అందులో ఏముందంటే..?
సంతోష్ రెడ్డి కుటుంబానికి ఆ బ్యాగ్ ఎక్కడ మర్చిపోయారో కొద్దిసేపటి వరకు గుర్తుకురాలేదు. ఆ తరువాత వెంటనే ఆలయంలోకి తీసుకెళ్లిన విషయం గుర్తు చేసుకున్నారు. హుటాహుటిన ఆలయం దగ్గరకు వెళ్లారు. ఈలోపు అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ బత్తెయ్యకు ఆ బ్యాగ్ కనిపించింది. అతడికి బ్యాగ్‌లో ఏముందని అనుమానం రావడంతో దగ్గరకు వెళ్లారు. తీరా తీసి చూసి సరికి అందులో డబ్బులు, ఇతర వస్తు సామాగ్రి ఉన్నాయి. వెంటనే ఆ బ్యాగ్‌ను సెక్యూరిటీ గార్డు తీసుకెళ్లి అక్కడ ఉన్న హోంగార్డులకు అప్పగించారు.
ఈలోపు అక్కడికి వెళ్లిన సంతోష్‌రెడ్డికి అసలు విషయం తెలిసినది. స్వామి వారిని దర్శించుకునే సమయంలో బ్యాగ్‌ను ఆలయంలో మర్చిపోయారు. బ్యాగులో రూ.11వేల నగదుతో పాటు ఒక ఏటీఎం కార్డు ఉంది. సంతోష్‌రెడ్డి చెప్పిన వివరాలు సరైనవి కావడంతో అతనికి బ్యాగ్‌ను అప్పగించారు. బ్యాగ్‌ను తిరిగిచ్చిన సెక్యూరిటీ గార్డ్ బత్తెయ్యకు సంతోష్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అధికారులు కూడ బత్తెయ్యను అభినందించారు.