కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం
మొదటి నుంచి బీజేపీ తనదైన శైలిలో దూసుకెళ్లింది. కేవలం ఎనిమిది, పదకొండు రౌండ్లలో కాస్త వెనుకంజ పడింది. మళ్లీ పుంజుకొని ఊహించని విధంగా మెజార్టీలో ముందంజలో నిలిచింది బీజేపీ. ఇక రెండు మండలాలో మాత్రమే కౌంటింగ్ జరగాల్సి ఉన్నది.వీటిపై బీజేపీ భారీ ఆశలున్నాయి. బీజేపీ నేతలు అక్కడక్కడ సంబురాలు జరుపుకుంటున్నారు. ఈటల గెలుపు ఖాయం అని పేర్కొన్నారు. గత దుబ్బాక ఫలితాలు నవంబర్లోనే వచ్చాయి. హుజూరాబాద్ కూడ నవంబర్లోనే ఫలితాలు రావడంతో బీజేపీకి నవంబర్ నెల కలిసి వస్తోందనే చర్చ మొదలైంది.