హుజూరాబాద్ ఉ ప ఎన్నిక ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తొలి ఏడు రౌండ్ల లో బీజేపీ కే మెజార్టీ వచ్చింది. అయితే ఎనిమిదో రౌండ్లో మాత్రం తొలిసారి టీఆర్ ఎస్‌కు స్వల్ప మెజార్టీ వచ్చింది. ఎనిమిదో రౌండ్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కేవలం 162 ఓట్ల స్వల్ప మెజార్టీ వచ్చింది. ఇది గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలం అయిన వీణవంక కు చెందిన కౌంటింగ్. విచిత్రం ఏంటంటే గెల్లు శ్రీను స్వగ్రామంలోనే ఆయనకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఆయన స్వగ్రామం హిమ్మత్ సాగర్‌లో బీజేపీ అభ్యర్థి ఈటలకు 191 ఓట్ల మెజార్టీ ని ప్రజలు కట్టబెట్టారు. అంటే శ్రీనకు సొంత ఊళ్లోనే పట్టు లేదని అర్థమైంది. హిమ్మత్ సాగర్‌లో బీజేపీ కి 549 ఓట్లు రాగా.. టీఆర్ ఎస్ కు 358 ఓట్లు వచ్చాయి.