తెలంగాణ రాజకీయాలను గత రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ కు గురి చేసిన హుజూరా బాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభ మైంది. కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ కళాశాల లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభ మైంది. ఇప్పటి వరకు రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 360 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదిలా ఉంటే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆయన ఎదుర్కొంటోన్న తొలి ఎన్నిక ఇదే. అయితే కాంగ్రెస్ ప్రదర్శన ఇక్కడ ఘోరాతి ఘోరంగా ఉంది. తొలి రౌండ్లో ఆ పార్టీకి ఇండిపెండెంట్ల కన్నా తక్కువుగా కేవలం 119 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక రెండో రౌండ్లో కేవలం 220 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఓట్లు రేవంత్‌కు ఘోర అవమానం లాంటివే అని చెప్పాలి.