ఏపీలోని పంచాయితీలు మరియు మున్సిపాలిటీల ఉపఎన్నికలకు తాజాగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ సహా మిగిలిపోయిన పంచాయితీ లు, ఎంపిటిసి మరియు జెడ్పిటిసి, మున్సిపాలిటీ లకు ఖాళీ స్థానాల ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నవంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్టు ప్రకటించింది.
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక నవంబర్ 15 తేదీన జరగుతున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే విధంగా రాష్ట్రంలోని పంచాయితీ లకు 14 తేదీన మున్సిపాలిటీల్లో 15, ఎంపిటిసి, జెడ్పిటిసి లకు 16 తేదీన ఎన్నికలు జరపనున్నట్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇటీవలే రాష్ట్రంలో బద్వేల్ ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది.