పవన్ అందుకే ఓడిపోయారు... ఏకిపారేసిన ఎమ్మెల్యే...?
పవన్ మాటలు విని మోసపోయే ప్రజలు ఈ రాష్ట్రం లో లేరు అని అన్న ఆయన అందుకే గాజువాక లో పవన్ ఓడిపోయారు అని ఎద్దేవా చేసారు. గాజువాక లో నన్ను ఓడించారు... నన్ను గెలిపిస్తే పోరాటం చేసేవాడ్నీ అని అందరి ముందు చెప్పారు అని అన్నారు. ఎంత కాలం ప్రజలకు సినిమా డైలాగులు చెబుతారు అని నిలదీశారు. పవన్ రాకపోయినా ఉక్కు ఉద్యమం నడుస్తుంది అని వైసీపీ ముందుండి నడిపిస్తుంది అన్నారు ఆయన. గతం లో ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేశారు అని ఆయన గుర్తు చేసారు.
విశాఖ పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉక్కు కార్మికులను కలిశారు అని పేర్కొన్నారు. కార్మికులు చెప్పిన విషయాలను అసెంబ్లి లో తీర్మానం చేశారు అని ఆయన వివరించారు. పవన్ సభ లో మోదీ కోసం ఒక్క మాట అయిన మాట్లాడారా అని ఆయన నిలదీశారు. పవన్ కు దమ్ము ఉంటే ఢిల్లీ లో స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చెయ్యాలి అని హితవు పలికారు. స్ధిరంలేని నాయకుడు పవన్ అని అన్నారు ఆయన. ఇప్పటికే మూడు పార్టీలతో దోస్తీ చేసి కటీఫ్ అయింది? మళ్ళీ ఎవరితో జోడి కడతారో? అని ఆయన ఎద్దేవా చేసారు.