బస్సులోనే నిద్రపోయిన చంద్రబాబు...!

సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పర్యటన కాస్త హైలెట్ గా మారింది. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద బస్సులోనే చంద్రబాబు నాయుడు బస చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు  రెండవ రోజు పర్యటన కోసం భారీగా మోహరించిన పోలీసులు... ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.  నిన్నటి రోజు బహిరంగ సభలో పోలీసుల భద్రతా ఏర్పాట్లపై చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేసారు.

ఇక చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు పేరుతో  సోషల్ మీడియాలో వైరల్ కావడం కాస్త వివాదాస్పదం అయింది. ఈ పరిణామాలు మేరకు స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం ఇవాళ ఆయన పర్యటన కు భారీగా పోలీసులను భద్రత ను పెంచిందని తెలుస్తుంది. చంద్రబాబును కలసి తమ సమస్యలను విన్నవించుకుని,వినతులు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: