బ్రేకింగ్: ఇవ్వాళ కూడా డబ్బులు పంచుతున్నారుగా...?
హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో పరిస్థితి కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉంది. అక్కడ ఏ ఘటన జరుగుతుందో అని పోలీసులు అన్ని విధాలుగా అలెర్ట్ అయ్యారు. ఎన్నికల సంఘం కూడా పరిస్థితిని అన్ని విధాలుగా సమీక్షిస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఓటు వేసిన తర్వాత బిజెపి అభ్యర్ధి ఈటెల రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఈ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు అని ఆయన ఆరోపించారు. ఓటుకి డబ్బులు ఇవ్వలేదని ప్రజలు కూడా నిలదీసే విధంగా పరిస్థితి ఉందని ఆయన ఆరోపణలు చేసారు. ఇక పోలింగ్ బూత్ లో కూడా ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఇక ఇదిలా ఉంటే అక్కడ తెరాస నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం కాస్త సంచలనం అయింది. ఆయన బూత్ లో ప్రచారం చేస్తున్నారు అని ఆరోపణలు వచ్చాయి.