కన్నడ పవర్ స్టార్ మృతి..షాక్ లో నితిన్ ...!

frame కన్నడ పవర్ స్టార్ మృతి..షాక్ లో నితిన్ ...!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి టాలీవుడ్ హీరోలను షాక్ కు గురి చేస్తోంది. కేవలం 46 ఏళ్ల వయసు లోనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ పునీత్ మృతి తనను షాక్ కు గురి చేసినట్టు వ్యాఖ్యానించారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. మీ ఆత్మకు శాంతి కలగాలి సార్... చాలా తొందరగా వెళ్ళిపోయారు.


అంటూ నితిన్ ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా 2002 నుండి పునీత్ రాజ్ కుమార్ హీరోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 29 సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నారు. అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా ప్రశంసలు అందుకున్నారు. మరో వైపు డ్యాన్స్ లోనూ పునీత్ రాజ్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More