షాకింగ్: రైలు పచ్చ జెండా పిల్లాడి చేతిలో, అసలు ఏం జరిగింది...?

ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ఘటనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే కొందరి తీరులో మాత్రం ఏ మార్పు రావడం లేదు. తాజాగా తెలంగాణాలో ఒక ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకున్నది. మహబూబాబాద్ జిల్లాలో రైలు జెండా ఊపుతున్న చిన్న పిల్లవాడి వ్యవహారం బాగా హైలెట్ అయింది. సిబ్బంది చేతిలో ఉండాల్సిన ఆకుపచ్చ జెండా బాలుని చేతిలో ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆడుకునే వస్తువుగా, రైలు జెండా పట్టుకొని మాహబూబాబాద్  రైల్వే స్టేషన్ లో హల్ చల్ చేయడం వివాదాస్పదం అయింది. పట్టీపట్టనట్లుగా చూస్థున్న మహబూబాబాద్  రైల్వే అధికారుల తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రైలు వచ్చే సమయంలో జెండా ఊపి రైలు ఆపకుండా ఏదైనా ప్రమాదం జరిగితే...తప్పు ఎవరిదంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: