బద్వేల్ ఉప‌ఎన్నికకు వరుణుడి ఎఫెక్ట్..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో రేపు ఉపఎన్నిక ఉన్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా బ‌ద్వేల్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ వ‌ర్షం ఎఫెక్ట్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై ప‌డింది. ఇప్ప‌టికే పీవోలు, పీపీవోలు ఎన్నిక‌ల సామాగ్రి పంపిణీ కేంద్రం వ‌ద్ద‌కు చేరుకున్నారు. సామాగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు సమాయ‌త్తం అవుతుండ‌గానే ఉన్న‌ట్టుండి భారీ వ‌ర్షం వ‌చ్చింది. ఈ వ‌ర్షం అడ్డంకిగా మారిన‌ది. భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో ఎన్నిక‌ల సామాగ్రిని పంపిణీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్ప‌టికే షామియానాలు పూర్తిగా త‌డిసిపోయాయి. అదేవిధంగా సామాగ్రి పంపిణీ కేంద్రం వ‌ద్ద‌కు వ‌ర్షం కార‌ణంగా  సిబ్బంది కూడ రాలేక‌పోతున్నారు.  బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో అధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. పోలింగ్ నిర్వాహ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌న్నింటిని సిద్ధం చేస్తున్నారు అధికారులు.  ముఖ్యంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఉప‌యోగించే సామాగ్రి త‌డ‌వ‌కుండా జాగ్ర‌త్త‌గా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి 1000 గొడుగులు, 7వేల రెయిన్ కోట్ల‌ను పంపిణీ చేసేందుకు ఇప్ప‌టికే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. శ‌నివారం పోలింగ్ ఉండ‌డంతో ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: