తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు గంజాయి పై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సాగు చేస్తున్న గ్రామాల్లో సంచరిస్తూ అనుమానితుల ఇళ్లపై రైట్స్ నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోనూ డ్రగ్స్ పై నగర పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నగరంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న యువకుల సెల్ ఫోన్ తీసుకొని అందులో వాట్సాప్ చాటింగ్ ను సైతం చెక్ చేస్తున్నారు.
డ్రగ్స్ గంజాయి పై యువకులు ఏమైనా సంభాషణలు చేశారా అన్న నేపథ్యంలో పోలీసులు ఫోన్ చెక్ చేస్తున్నారు. ఒకవేళ యువకుల వద్ద ఏమైనా అనుమానాస్పద చాటింగ్ కనిపిస్తే వారిని స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులు వాట్సాప్ ను చెక్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు హైదరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.