చాలా రోజుల తరువాత
క్యాబినెట్ భేటీ జరిగింది ఆంధ్రావనిలో..! ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో బీసీల జనగణనకు సంబంధించి, ముఖ్యంగా కులాల వారిగా జనగణనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తూ
క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మాన ప్రతిని కేంద్రానికి పంపనుంది. అదేవిధంగా అగ్ర వర్ణాల సంక్షేమానికి ఓ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అగ్ర వర్ణాలకు ఓ శాఖ ను ఏర్పాటు చేయడం ఓ సాహసోపేత నిర్ణయం. దీంతో అంతటా ఈ నిర్ణయంపై ఆసక్తితో పాటు చర్చ కూడా నెలకొని ఉంది. ఇప్పటికే బ్రాహ్మణ, దళిత రాజకీయాలు పేరిట యూపీలాంటి ప్రాంతాలలో రాజకీయాలు నడుస్తున్న తరుణం ఒకటి ఉంది. ఇప్పుడు ఇదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ చేసేందుకు చూస్తున్నారా లేకా
బీసీ సంక్షేమ శాఖ లానే ఈ శాఖను కూడా కేవలం పేరు మాత్రమే పరిచయం చేసి, నామ మాత్రపు నిధులకు, విధులకు పరిమితం చేయనున్నారా అన్నది ఇప్పుడొక ప్రశ్న.